English | Telugu

పవన్ కొడుకు అఖీరా పై విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయా? 

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఈ నెల 20 న విడుదల అవుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అత్యంత వైభవంగా జరిగింది. పరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ అందరు ఈ ఈవెంట్ కి హాజరు అవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలువగా అలాగే ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఈ ఈవెంట్ కి ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇండియన్ సినిమా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ ఫంక్షన్ కి హాజరయ్యి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా నందన్ గురించి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అలాగే పరిశ్రమ వర్గాల్లో చర్చకి దారి తీశాయి.

సినిమా అభిమానులకి అలాగే ప్రేక్షకులకి హీరోలు, హీరోయిన్ లు,దర్శకులు,సంగీత దర్శకులు గురించి తెలియడం సహజం. కానీ సినిమానే తయారు కావడానికి కారణం తో పాటు ఎవరు ఎన్ని ఆటలైనా ఆడటానికి మూల కారకుడైన స్టోరీ రైటర్ గురించి మీకు తెలుసా అని అడిగితే ఎవరు చెప్పలేరు. ఏ కొద్దీ మంది మాత్రమే చెప్పగలరేమో. కానీ ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు,ప్రేక్షకుల గుండెల్లో చెక్కు చెదరకుండా గుర్తుండి పోయిన స్టోరీ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ కీర్తిని గడించారు. విజయేంద్ర ప్రసాద్ కథని అందించిన సినిమా ల లిస్ట్ చెప్పమంటే ప్రతి ఒక్కరు చెప్తారు. అలాగే తన కొడుకు రాజమౌళి నేడు భారతదేశం గర్వించదగే దర్శకుడుగా ఉన్నారు అంటే విజయేంద్ర ప్రసాద్ గారు అందించిన కథలే కారణం. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తప్పించి నేటి ఆర్ఆర్ఆర్ దాకా విజయేంద్ర ప్రసాదే రాజమౌళి ప్రతి సినిమా కి కథలని అందించారు.

ఇక అసలు విషయానికి వస్తే టైగర్ నాగేశ్వరావు ఫంక్షన్ లో పాల్గొన్నవిజయేంద్రప్రసాద్ అదే కార్యక్రమం లో పాల్గొన్న రేణు దేశాయ్ తో రేణు దేశాయ్ గారు మీరు తప్పని సరిగా మీ కొడుకు అఖీరా నందన్ ని సినిమా హీరో చెయ్యాలని అలాగే మీరు ఆ సినిమా లో అఖీరా కి తల్లిగా యాక్ట్ చెయ్యాలని అన్నారు.ఆయన మాటలకి సరే అన్నట్టుగా రేణు దేశాయ్ కూడా అఖీరా ని హీరో చేస్తానని అనేలా చేయి ఊపుతూ తన ఇష్టాన్ని తెలిపింది. రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరావు మూవీ లో ఒక రియల్ స్టిక్ పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇంకో పక్క విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు విన్న పవన్ అభిమానులు అలాగే సినీ అభిమానులు మరియి పరిశ్రమ వర్గాలందరు అఖీరా మొదటి సినిమా కి విజయేంద్ర ప్రసాద్ గారే కథని అందిస్తే సూపర్ గా ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఏమో వాళ్ళ కోరిక నెరవేరచ్చేమో..

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.