English | Telugu

‘యానిమల్‌’ మూవీని తెలుగులో మహేష్‌తో చేస్తా: సందీప్‌రెడ్డి 

తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని రూపొందించి తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆ తర్వాత హిందీలో షాహిద్‌ కపూర్‌తో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని ‘కబీర్‌సింగ్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌లో కూడా సూపర్‌హిట్‌ సాధించి దేశంలోని టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరుగా ఎదిగారు సందీప్‌రెడ్డి. తాజాగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన మరో వైల్డ్‌ మూవీ ‘యానిమల్‌’. దేశంలోని పలు భాషల్లో డిసెంబర్‌ 1న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సందీప్‌రెడ్డి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

ఎన్టీఆర్, ప్రభాస్ తో కాదు.. అతనితోనే నా నెక్స్ట్ మూవీ!

నాని హీరోగా నటించిన 'దసరా'తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన దసరా మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్ హీరోలను, కమర్షియల్ సినిమాలను డీల్ చేయగలడనే నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు. ఇక ఈ కుర్ర దర్శకుడు తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి బిగ్ స్టార్స్ తో చేసే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ చెప్పేశాడు.