English | Telugu
ఎన్టీఆర్, ప్రభాస్ తో కాదు.. అతనితోనే నా నెక్స్ట్ మూవీ!
Updated : Nov 27, 2023
నాని హీరోగా నటించిన 'దసరా'తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన దసరా మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్ హీరోలను, కమర్షియల్ సినిమాలను డీల్ చేయగలడనే నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు. ఇక ఈ కుర్ర దర్శకుడు తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి బిగ్ స్టార్స్ తో చేసే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ చెప్పేశాడు.
తాజాగా దర్శకుడు శ్రీకాంత్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ యంగ్ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ తో సినిమా అనే న్యూస్ పై స్పందించిన ఆయన.. అందులో వాస్తవం లేదని, అసలు ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో తెలీదని అన్నాడు. ప్రస్తుతం నాని కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని, అది యాక్షన్ జానర్ లో ఉంటుందని తెలిపాడు. మొత్తానికి 'దసరా' కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చేసింది.