English | Telugu

హీరో మహేష్‌.. అందుకే సూపర్‌స్టార్‌ మహేష్‌ అయ్యాడు!

ప్రతి హీరోకీ అభిమానులు ఉంటారు. అయితే వారి వారి రేంజ్‌ని బట్టి అభిమానులు ఉంటారు. ముఖ్యంగా టాప్‌ హీరోల అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు.. సెల్ఫీలు అంటూ బయల్దేరతారు. ఈ విషయంలో హీరోలు, హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి వారికి కూడా సెల్ఫీలు తీయించుకునేందుకు వచ్చేవారిపై కోపం వస్తుంది. అభిమానులపై చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో టాప్‌ హీరోలే కాదు, చిన్నా చితకా నటులు కూడా సెల్ఫీల కోసం వచ్చే అభిమానులపై విసుగును ప్రదర్శిస్తారు. వారిని తిటిన సందర్భాలు కూడా ఉన్నాయి.