English | Telugu

ఆ విషయంలో మాత్రం అల్లు అర్జున్ తర్వాత ఇక విజయ్ దేవరకొండనే..ఫ్యాన్స్ లో హుషారు

పెళ్లిచూపులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తో యూత్ ని గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీని తన వైపు చూసేలా చేసుకొని ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ ,వరల్డ్ ఫేమస్ లవర్ ,లైగర్, ఖుషి ఇలా విభిమన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించాడు. తన సినిమాల ద్వారా ఎన్నో రికార్డ్స్ ని సృష్టించిన విజయ్ తాజాగా ఒక సరికొత్త రికార్డు ని సృష్టించాడు

విజయ్ సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటు తన అభిమానులతో తన పర్సనల్ విషయాలని కూడా పంచుకుంటు ఉంటాడు. తాజాగా విజయ్ ఇనిస్టాగ్రమ్ లో 20 మిలియన్ ఫాలోయర్స్ ని సంపాదించాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత ఇనిస్టాగ్రమ్ లో అంతటి ఫాలోయర్స్ ని సాధించిన సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ నే. ఇప్పుడు ఈ విషయంతో విజయ్ కి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ ఏ పాటిదో మరో సారి అందరికి అర్ధమయ్యింది. అలాగే తన ని అభిమానించే అభిమానుల కోసం ఏమైనా చేసే హీరోల్లో విజయ్ కూడా ఒకడు. మొన్నీ మధ్య తన 100 మంది అభిమానులొక్కక్కరికి లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సాయం అందించాడు.

విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో పాటు జెర్సీ మూవీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని సినిమాలోను నటిస్తున్నాడు.ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిల్లో ముందుగా ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఆల్రెడీ విజయ్ పరశురామ్ ల కాంబినేషన్ లో గీత గోవిందం సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది. ఇవే కాకుండా మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు విజయ్ చేతిలో ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.