English | Telugu
రికార్డుల దాహం తీరని వెంకటేష్
Updated : Nov 27, 2023
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ సైంధవ్.వెంకేటేష్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుంటున్న ఈ మూవీ మీద వెంకీ అభిమానులల్లోను,ప్రేక్షకుల్లోను, ట్రేడ్ వర్గాల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. తన సినీ కెరీర్లో ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న వెంకీ ఇప్పుడు తాజాగా సైంధవ్ ద్వారా ఇంకో సరికొత్త రికార్డు ని తన ఖాతాలో వేసుకున్నాడు.
సైంధవ్ నుంచి తాజాగా రాంగ్ యూసేజ్ అనే సాంగ్ విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సాంగ్ కి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇన్ స్టాగ్రామ్ లో 10 వేలకి పైగా రీల్స్ వచ్చాయి.ఈ నెంబర్ ని బట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఆస్కార్ విజేత చంద్రబోస్ కలం నుంచి వచ్చిన ఈ రాంగ్ యూసేజ్ సాంగ్ గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది. లిరిక్స్ చాలా క్యాచీగా ఉండటం ఈ సాంగ్ ప్రత్యేకత. పైగా ఈ సాంగ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి సంచలనాలు సృష్టిస్తుంది. మిగతా భాషల్లో కూడా ఆయా భాషల్లో పేరుమోసిన లిరిక్ రైటర్స్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించడం విశేషం. సంతోష్ నారాయణ్ సంగీత సారధ్యంలో ఈ రాంగ్ యూసేజ్ తెరకెక్కింది.
నిహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నసైంధవ్ కి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 23 న వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లో వరల్డ్ వైడ్ గా సైంధవ్ విడుదల అవ్వబోతుంది. వెంకటేష్ తో శ్రద్ద శ్రీనాధ్ జోడీకడుతుండగా బాలీవుడ్ అగ్ర నటుడు నవాజుద్దీన్ సిద్ధికి విలన్ గా చేస్తున్నాడు .కాగా ఈ సైంధవ్ వెంకీ నుంచి వస్తున్న 75 వ చిత్రం.