English | Telugu

ఆగని వికృత చేష్టలు.. అలియా భట్‌పై ఎఐ నీడ!

ఆధునిక టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నా.. దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు వ్యక్తులు. ఇటీవల రష్మిక మందన్నపై ప్రయోగించిన ఎఐ టెక్నాలజీ వల్ల విడుదలైన వీడియో ఎంతటి దుమారాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండిరచారు. రష్మికకు ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతు పలికారు. ఆ ఘటన మరవక ముందే బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ ఫేక్‌ వీడియో రిలీజ్‌ అయింది. దీనిపై కూడా అందరూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నటీమణులకు రక్షణ లేకుండా పోయిందని అందరూ అభిప్రాయపడ్డారు.

ఇవన్నీ మరచిపోకముందే ఇప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ వీడియో వెలుగులోకి వచ్చింది. అసభ్యంగా కదులుతూ ఫోజులు ఇస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి వీడియోలను షేర్‌ చేయవద్దని, వైరల్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ తంతు మాత్రం మారడం లేదు. టెక్నాలజీ పరంగా ప్రపంచం పరుగులు తీస్తున్న నేపథ్యంలో ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వకుండా చేయడం అసాధ్యమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎవరికి వారు విజ్ఞతతో వ్యవహరించి షేర్‌ చేయడం మానుకుంటే తప్ప ఈ వీడియోల పరంపర ఆగదని మరికొందరి అభిప్రాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.