English | Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఇంట్లో ఉంచుకొని ప్రభాస్ చేత ఆ పని చేయించిన సుధీర్ బాబు

తన సినీ కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తు ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన హరోం హర అనే మూవీ చేస్తున్నాడు. మేకర్స్ హరోం హర అనే టైటిల్ ని ప్రకటించినప్పుడే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. తాజాగా హరోంహర నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది .ఒక అగ్ర హీరో ఈ టీజర్ విడుదల చెయ్యడంతో ఇప్పుడు హరోం హర కి అదనపు ఆకర్షణ వచ్చింది.

రెబల్ స్టార్ ప్రభాస్ కొద్దిసేపటి క్రితమే హరోంహర టీజర్ ని రిలీజ్ చేసాడు .దీంతో హరోంహర టాక్ అఫ్ ది డే గా నిలిచింది టీజర్ చూస్తున్నంత సేపు ఈ మూవీ రొటీన్ చిత్రాలకి భిన్నంగా రూపుదిద్దుకోబోతుందని తెలుస్తుంది. సుధీర్ బాబు గెటప్ కూడా కొత్తగా ఉంది. ఎలాంటి గొడవలని అయినా ఎదుర్కొనే సత్తా తనకి ఉండి కూడా సైలెంట్ గా ఉండే సుధీర్ ఆ తర్వాత గొడవల్లో కి వెళ్లే విధంగా ట్రైలర్ ఉంది. అలాగే టీజర్ లో చెప్పిన డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి.నెక్స్ట్ ఇయర్ ప్రథమార్ధంలో రాబోతున్న ఈ హరోంహర లో షుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, రాజశేఖర్ అనింగి, కేశవ్ దీపక్ ,అర్జున్ గౌడ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీ సుబ్రమణ్య సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక రచన దర్శకత్వ బాధ్యతలని అందిస్తుండగా అరవింద్ విశ్వనాథన్ కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ సంగీత సారథ్యంలో హరోంహర రానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.