English | Telugu
మోదీతో తన ప్రేమ, పెళ్లి విషయం పై స్పందించిన సుస్మితాసేన్
Updated : Nov 27, 2023
మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ గురించి భారతీయ సినీ ప్రేక్షకుల అందరికి సుపరిచితమే.90 వ దశకంలో బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన సుస్మితా తెలుగులో నాగార్జున తో రక్షకుడు అనే సినిమాలో కూడా నటించింది.నిత్యం సంచలన వార్తల్లో ఉండే ఆమె తాజాగా ఇంకో సంచలనానికి తెరదీసింది. కొన్ని రోజుల క్రితం తన మీద వచ్చిన ఒక రూమర్ కి తనదిన స్టైల్లో సమాధానం ఇచ్చి తనకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కి సుస్మిత మరో సారి న్యాయం చేకూర్చింది .
సుస్మితా ప్రస్తుతం ఆర్య సీజన్ 3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్ లో ఆమెకి ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ల మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించిసుస్మితా ముందు ప్రస్తావనకి వచ్చింది. అప్పుడు సుస్మితా ఏ మాత్రం తడుముకోకుండా నేను పలనా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఎవరెన్ని అనుకున్నా ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. అంతే కానీ పెళ్లి పేరు చెప్పుకొని ఎవరితో తిరగను. నాపై వస్తున్న మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు నిజాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మనం నిశ్శబ్దంగా ఉంటే ఆ మౌనాన్ని బలహీనతగా భావిస్తారు.అందుకే అలాంటి వారికి తెలియజేయడానికి గతంలో నా నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాను అని సుస్మితా చెప్పుకొచ్చింది
కొన్ని నెలల క్రితం ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోడీతో కలిసి సుస్మితా సేన్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ టైంలో కేవలం మోదీ దగ్గర ఉన్న డబ్బుల కోసమే సుస్మితా మోదీ తో తిరుగుతుందనే విమర్శలు చాలానే వచ్చాయి. ఆ తర్వాత మోదీ కి ఆమె కటీఫ్ చెప్పింది. ఆమె ప్రస్తుతం తన మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ తో డేటింగ్ లో ఉంది. సుస్మితా సేన్ వయసు 47 ఏళ్లు కాగా రోహ్మన్ షాల్ వయసు 32 ఏళ్లు..ఇప్పుడు సోషల్ మీడియాలో సుస్మితా కి సంబంధించిన ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.