English | Telugu

మెగాస్టార్‌ చిరంజీవి, త్రిషలపై పరువు నష్టం దావాకు రంగం సిద్ధం?

కొందరు నటీనటులు వివాదాలు సృష్టిస్తారు. వాటిని కొనసాగిస్తూ అందులోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వారిలో నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ఒకరు అని చెప్పొచ్చు. ఇటీవల త్రిష, ఖుష్‌బూ, రోజాలపై అతను చేసిన సంచలన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఎంతో మంది సినీ ప్రముఖులు అతని వ్యాఖ్యలను ఖండిరచారు. నటీమణులకు అండగా నిలిచారు. చివరికి నెటిజన్లు సైతం వారికి మద్దతు తెలుపుతూ కామెంట్స్‌ పెట్టారు. కానీ, మన్సూర్‌ మాత్రం దిగి రాలేదు. తను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రకటించాడు. ఒక దశలో త్రిషకు క్షమాపణ చెప్పాలని మన్సూర్‌పై వత్తిడి వచ్చింది. దానికి కూడా తలొగ్గని మన్సూర్‌ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. చివరికి ఈ విషయం జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి వెళ్లడంతో దాన్ని సుమోటోగా స్వీకరించి మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు చెయ్యాలని పోలీసులను ఆదేశించింది. దీంతో అతనిపై కేసు నమోదు కావడం, కోర్టు సమన్లు జారీ చేయడం వేగంగా జరిగిపోయాయి. ఇక తప్పని పరిస్థితిలో విచారణకు హాజరయ్యాడు మన్సూర్‌. చివరికి త్రిషకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. అంతటితో ఈ వివాదానికి తెరపడిరదని అందరూ భావించారు. కానీ, అది అక్కడితో ఆగిపోలేదు.. సెకండాఫ్‌ కూడా ఉందని ఇటీవల మన్సూర్‌ స్పష్టం చేశాడని తెలుస్తోంది.

తాజాగా త్రిష, మెగాస్టార్‌ చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా వేస్తానని మన్సూర్‌ ప్రకటించి మరో వివాదానికి తెరలేపాడు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన త్రిష, చిరంజీవి, ఖుష్బులపై పరువు నష్టం దావా, క్రిమినల్‌ కేసు, ముందస్తు అల్లర్లు, ఇతరులను రెచ్చగొట్టడం లాంటి సెక్షన్ల కింద కేసు వేస్తున్నట్లు ప్రకటించాడు మన్సూర్‌ అలీఖాన్‌. తన లాయర్‌ గురు ధనంజయన్‌ ద్వారా కోర్టులో కేసు వేసి.. వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. త్రిష విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎడిట్‌ చేసి ఆమె గురించి అసభ్యంగా మాట్లాడినట్టు క్రియేట్‌ చేశారని మన్సూర్‌ ఆరోపిస్తున్నాడు. తాను మాట్లాడిన నిజమైన వీడియో కోర్టుకు సమర్పిస్తున్నానని, దాని ఆధారంతోనే వారిపై కోర్టులో కేసు వేయనున్నట్టు మన్సూర్‌ చెబుతున్నాడు. ఇప్పుడు మన్సూర్‌ లేవనెత్తిన కొత్త సమస్య ఎటు వెళుతుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో, దీనిపై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .