బన్నీ నెక్స్ట్ మూవీ మారింది.. త్రివిక్రమ్ ప్లేస్ లో బోయపాటి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. 'పుష్ప-1'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ, పార్ట్-2 తో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. దీని తర్వాత ఐకాన్ స్టార్ చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో కూడిన పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే బన్నీ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రకటించాడు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి విజయవంతమైన చిత్రాల తరవాత వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా కావడంతో ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆలస్యం కానుందనే వార్త ఆసక్తికరంగా మారింది.