మంచు విష్ణు 'కన్నప్ప' ఫస్ట్ లుక్.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు!
ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ప్రారంభమైన 'కన్పప్ప' సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ కన్నప్ప ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. విష్ణు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప నుంచి తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.