English | Telugu
వీరప్పన్ మళ్లీ వస్తున్నాడు.. ఏ రూపంలోనో తెలుసా?
Updated : Nov 27, 2023
వీరప్పన్ పేరు విననివారు, అతని గురించి తెలియని వారు ఉండరు. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి 30 సంవత్సరాలపాటు తప్పించుకొని తిరిగిన వీరప్పన్ చివరికి అనూహ్యం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అతని జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పటివరకు అతని జీవిత చరిత్రతో కూడిన సినిమాలు వచ్చాయి. అయితే రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
వీరప్పన్ జీవితంలోని విశేషాలను రెండున్నర గంటల సమయంలో చెప్పడం కష్టమైన పనే. అందుకే ఇప్పుడు వీరప్పన్ చరిత్ర సినిమా రూపంలో కాకుండా, వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘కూసే మునిస్వామి వీరప్పన్’ అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డీటైల్స్ కూడా విడుదల చేశారు. జీ 5లో డిసెంబర్ 8 నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్‌కు శరత్ జ్యోతి దర్శకత్వం వహించారు.