మరో తెలుగు చిత్రంలో `దంగల్` భామ?
`ఇష్క్`, `చాచి 420`, `బడే దిల్ వాలా`, `వన్ 2 కా 4` చిత్రాల్లో బాలనటిగా అలరించి.. ఆపై `దంగల్`లో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూతురి పాత్రలో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది ఫాతిమా సనా షేక్. అయితే, `దంగల్` కంటే ముందు `నువ్వు నేను ఒకటవుదాం` (2015) అనే తెలుగు చిత్రంలో కథానాయికగా దర్శనమిచ్చింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.