English | Telugu

పూజా హెగ్డే @ రూ. 2.5 కోట్లు!

తెలుగునాట పూజా హెగ్డేకి ఎలాంటి డిమాండ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌స్ట్ గెస్ట్ రోల్స్ కే రూ.కోటికి త‌గ్గ‌కుండా పారితోషికం పుచ్చుకుంటున్న వైనం ఈ బుట్ట‌బొమ్మ సొంతం. ఇక త‌నే మెయిన్ లీడ్ గా న‌టిస్తే.. రూ. 2 కోట్లకి రూపాయి కూడా త‌గ్గించ‌డం లేద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ బ‌జ్. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుండ‌డంతో.. పూజ ఎంత చెప్తే అంత ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొని ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా పూజా హెగ్డే ఓ క్రేజీ కోలీవుడ్ వెంచ‌ర్ కి సైన్ చేసిందట‌. అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ న‌టించ‌నున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ. రెండున్న‌ర కోట్లు డిమాండ్ చేసింద‌ట పూజ‌‌. దాదాపు తొమ్మిదేళ్ళ త‌రువాత త‌మిళంలో పూజ చేస్తున్న సినిమా అయిన‌ప్ప‌టికీ.. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే ఉద్దేశంతో ఉన్న మేక‌ర్స్.. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. త్వ‌రలోనే ప‌ట్టాలెక్క‌నుంది.

కాగా, పూజ న‌టించిన 'ఆచార్య‌', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్', 'రాధేశ్యామ్' తక్కువ గ్యాప్ లోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నున్నాయి. ‌‌