English | Telugu

వ‌రుణ్ తేజ్‌తో వెంకీ కుడుముల‌?

`ఛ‌లో`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు వెంకీ కుడుముల‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న ఈ యంగ్ టాలెంటెడ్.. ఆపై `భీష్మ‌` రూపంలో మ‌రో సూప‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. `భీష్మ‌` విడుద‌లై ఏడాది దాటినా.. వెంకీ కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. ప‌లు కాంబినేష‌న్స్ లో త‌న పేరు వినిపించినా.. కార్య‌రూప‌మైతే దాల్చ‌లేదు.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. రీసెంట్ గా మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో వెంకీకి ప్రాజెక్ట్ సెట్ అయిందట‌. రొమాంటిక్ కామెడీ (రోమ్ - కామ్)గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో వెంకీకి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట వ‌రుణ్. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే వ‌రుణ్, వెంకీ కాంబో మూవీకి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. వ‌రుణ్ ప్ర‌స్తుతం `గ‌ని`, `ఎఫ్ 3` చిత్రాలు చేస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న `గ‌ని`ని నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తుండ‌గా.. విక్ట‌రీ వెంక‌టేశ్ తో క‌లిసి న‌టిస్తున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ `ఎఫ్ 3`ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నున్నాయి.