English | Telugu

`హిట్ ` సీక్వెల్ లో ర‌వితేజ హీరోయిన్?

నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన `హిట్` చిత్రం.. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌లై స‌ర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. విశ్వ‌క్ సేన్, రుహానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ద్వారా శైలేశ్ కొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

క‌ట్ చేస్తే.. ఈ సినిమాకి సీక్వెల్ గా `హిట్ 2` రాబోతుందంటూ త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇటీవ‌ల నాని ప్ర‌క‌టించేశారు. కొన‌సాగింపు చిత్రాన్ని కూడా శైలేశ్ కొల‌నునే డైరెక్ట్ చేయ‌నున్నారు. కాగా, ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర కోసం మాస్ మ‌హరాజా ర‌వితేజ `ఖిలాడి`లో ఓ హీరోయిన్ గా న‌టిస్తున్న మీనాక్షి చౌద‌రిని ఎంచుకున్న‌ట్లు టాక్. ఇప్ప‌టికే ఈ మేర‌కు మీనాక్షితో `హిట్ 2` టీమ్ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని, పాత్ర న‌చ్చ‌డంతో మీనాక్షి కూడా ఓకే చెప్పింద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే `హిట్ 2`లో మీనాక్షి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. `ఖిలాడి` వేస‌వి కానుక‌గా మే 28న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. అంతకంటే ముందు.. సుశాంత్ కి జంట‌గా మీనాక్షి చౌద‌రి న‌టించిన `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు` రిలీజ్ కానుంది. మ‌రి.. ఒక్క సినిమా విడుద‌ల కాక‌ముందే వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతున్న మీనాక్షి.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందేమో చూడాలి.