English | Telugu

`దృశ్యం 2`లో రానా, సామ్?

`దృశ్యం`కి సీక్వెల్ గా విక్ట‌రీ వెంక‌టేశ్ `దృశ్యం 2` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `దృశ్యం 2` మ‌ల‌యాళ వెర్ష‌న్ ని తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ నే ఈ రీమేక్ సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. `దృశ్యం`లో న‌టించిన మీనా, న‌దియా, న‌రేశ్, ఎస్తేర్ అనిల్.. `దృశ్యం 2`లోనూ ద‌ర్శ‌నమివ్వ‌నున్నారు. కాగా, `దృశ్యం 2`లో పాత పాత్ర‌ల‌తో పాటు కొన్ని కొత్త పాత్ర‌లు కూడా తోడ‌య్యాయి. అవే.. స‌రిత‌, సాబు. క‌థానాయ‌కుడి పొరుగుంటిలో కొత్త‌గా చేరే ఈ భార్యా‌భ‌ర్త‌లు పాత్ర‌లు.. సినిమాలో చాలా కీల‌కం.

అలాంటి ఆ క్యారెక్ట‌ర్స్ లో ప్ర‌ముఖ న‌టులు స‌మంత‌, ద‌గ్గుబాటి రానా న‌టిస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఈ మేర‌కు వీరితో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని టాక్. త్వ‌ర‌లోనే రానా, సామ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. రానా, సామ్ చేరిక `దృశ్యం 2`కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. జూన్ లేదా జూలైలో `దృశ్యం 2` థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.