English | Telugu

బ‌న్నీ చిత్రంలో టొవినో థామ‌స్?

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో ముందుకు సాగుతున్న‌ మ‌ల‌యాళ క‌థానాయ‌కుల్లో టొవినో థామ‌స్ ఒక‌రు. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయిన `ఫోరెన్సిక్`, `మాయాన‌ది`, `వ్యూహం`, `లూకా` వంటి మ‌ల‌యాళ సినిమాల అనువాదాల‌తో ఇక్క‌డివారికి కూడా చేరువయ్యారు టొవినో.

క‌ట్ చేస్తే.. అల్లు అర‌వింద్ వారి ఓటీటీ `ఆహా`లో తెగ సంద‌డి చేసేస్తున్న ఈ యంగ్ టాలెంటెడ్.. త్వ‌ర‌లో అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు అర్జున్ తో క‌ల‌సి న‌టించ‌బోతున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో బ‌న్నీ ఓ సోష‌ల్ డ్రామా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో టొవినో థామ‌స్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ట‌. అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర కావ‌డంతో టొవినో థామ‌స్ కూడా ఈ చిత్రంలో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు టాక్. త్వ‌ర‌లోనే బ‌న్నీ - కొర‌టాల శివ కాంబో మూవీలో `ఫోరెన్సిక్` స్టార్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. అనువాదాల‌తో తెలుగువారికి చేరువైన టొవినో థామ‌స్.. ఫ‌స్ట్ టాలీవుడ్ స్ట్ర‌యిట్ ఫిల్మ్ తో ఇక్క‌డి వారిని ఏ స్థాయిలో అల‌రిస్తారో చూడాలి.‌