`యన్టీఆర్ 30`లో డబుల్ నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ యాక్ట్రస్?
అలనాటి కథానాయికలను తన చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటింపజేయడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి. నదియా (అత్తారింటికి దారేది, అఆ), స్నేహ (సన్నాఫ్ సత్యమూర్తి), ఖుష్బూ (అజ్ఞాతవాసి), దేవయాని - సితార - ఈశ్వరీ రావ్ (అరవింద సమేత), టబు (అల వైకుంఠపురములో).. ఇలా పలువురు నిన్నటి తరం కథానాయికలు త్రివిక్రమ్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో అలరించారు.