టబు క్యారెక్టర్‌కు నయనతార ఒప్పుకుంటుందా?
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే జంటగా నటించిన హిందీ ఫిల్మ్ 'అంధాధున్'. ఇటు విమర్శకుల ప్రశంసల్నీ, అటు ప్రేక్షకాదరణనీ పొందిన ఆ సూపర్ హిట్ మూవీలో టబు ఓ కీలక పాత్రను చేశారు. శ్రీరామ్ రాఘవన్ డైరెక్టర్ చేసిన ఆ క్రైమ్ థ్రిల్లర్‌లో మొదట అంధుడిగా నటిస్తూ, జనాల్ని నమ్మిస్తూ, తర్వాత నిజంగానే అంధుడిగా మారే పియానో ప్లేయర్‌గా ఆయుష్మాన్ నటన అందరినీ ఆకట్టుకుంది.