సలార్.. విలన్ ఫిక్స్ అయ్యాడా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో విలన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యముంటుంది. వర్షం, ఛత్రపతి, మిర్చి, బాహుబలి సిరీస్.. ఇలా ప్రభాస్ ప్రతీ బ్లాక్ బస్టర్ మూవీలోనూ కథానాయకుడి పాత్రకి దీటుగా ఉండే ప్రతినాయక పాత్రలే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్ కెరీర్ లో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ లో విలన్ గా ఎవరు నటిస్తున్నారు? అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.