English | Telugu

`క‌ప్పేళ‌` రీమేక్ లో శివాత్మిక‌?

`క‌ప్పేళ‌`.. స‌రిగ్గా ఏడాది క్రితం కేర‌ళ ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ. అన్నా బెన్, శ్రీ‌నాథ్ భ‌సి, రోష‌న్ మాథ్యూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌హ్మ‌ద్ ముస్తాఫా రూపొందించిన ఈ మ‌ల‌యాళ సినిమా.. అటు ప్రేక్ష‌కుల‌ను, ఇటు విమ‌ర్శ‌కుల‌ను మెప్పించింది. నెట్ ఫ్లిక్స్ లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన `క‌ప్పేళ‌`.. తెలుగులో రీమేక్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించ‌నున్న ఈ రీమేక్ లో క‌థానాయిక పాత్ర‌లో రాజ‌శేఖ‌ర్, జీవిత దంప‌తుల‌ చిన్న కుమార్తె శివాత్మిక ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని టాక్. ఇప్ప‌టికే ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర కావ‌డంతో శివాత్మిక ఈ రీమేక్ లో న‌టించేందుకు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని వినికిడి. ఇక శ్రీ‌నాథ్, రోష‌న్ పాత్ర‌ల్లో విశ్వ‌క్ సేన్, న‌వీన్ చంద్ర న‌టించే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

కాగా, `దొర‌సాని`తో క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసిన శివాత్మిక‌.. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తండ‌`లో న‌టిస్తోంది.