English | Telugu

ఉగాదికి ఫిక్సైన మాస్ మ‌హారాజా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం `ఖిలాడి` చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నారు. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రాన్ని ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాని మే 28న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌రువాత `నేను లోక‌ల్` ఫేమ్ త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ఓ చిత్రాన్ని చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హరించ‌నున్నారు. కాగా, ఈ చిత్రాన్ని మే నెల‌లో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్లు ఆ మ‌ధ్య క‌థ‌నాలు వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 13న ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రావ‌చ్చు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. ఈ ఏడాది చివ‌ర‌లో థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది. మ‌రి.. `క్రాక్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత రాబోతున్న ర‌వితేజ కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాయో చూడాలి.