English | Telugu

`య‌న్టీఆర్ 30`.. సీజ‌న్ ఛేంజ్?

`అర‌వింద స‌మేత‌` వంటి విజయ‌వంత‌మైన చిత్రం త‌రువాత యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. య‌న్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని య‌న్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న లాంఛ‌నంగా ప్రారంభించి.. 2022 సంక్రాంతి సీజ‌న్ లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇప్ప‌టికే పొంగ‌ల్ సీజ‌న్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిరియ‌డ్ డ్రామా, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు `స‌ర్కారు వారి పాట‌` బ‌రిలో ఉండ‌డంతో.. 2022 వేస‌వి ఆరంభంలో `య‌న్టీఆర్ 30`ని విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

`అయినా పోయి రావాలె హ‌స్తిన‌కు`, `రాజా వ‌చ్చినాడు`, `చౌడ‌ప్ప నాయుడు` వంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రంలో క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న ఓ నాయిక‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని టాక్.

కాగా, తార‌క్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్` ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా నటిస్తున్న ఈ మ‌ల్టిస్టార‌ర్ కి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కెప్టెన్.