English | Telugu

40 ఏళ్ల అవివాహిత పాతికేళ్ల యువ‌కుడి ప్రేమ‌లో ప‌డితే?

'మిర్చి', 'భాగ‌మ‌తి' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క శెట్టితో పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ యూవీ క్రియేష‌న్స్ మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. 'రా రా కృష్ణ‌య్య‌' ఫేమ్ మ‌హేశ్ పి. డైరెక్ట్ చేయ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇదిలా ఉంటే.. ఇందులో 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌' ఫేమ్ న‌వీన్ పోలిశెట్టి మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ఆమ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

కాగా, ఇంకా సెట్స్ పైకి వెళ్ళ‌ని ఈ సినిమా స్టోరీ లైన్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. 40 ఏళ్ళ వ‌య‌సున్న ఓ పెళ్ళి కాని మ‌హిళ‌, పాతికేళ్ళ ఓ యువ‌కుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? వారి ల‌వ్ స్టోరీ ఏ తీరాల‌కు చేరింద‌‌నే పాయింట్ తో అనుష్క‌, న‌వీన్ కాంబో మూవీ తెర‌కెక్క‌నుంద‌ట‌. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. న‌వీన్ పోలిశెట్టి తాజా చిత్రం 'జాతిరత్నాలు' మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న థియేట‌ర్స్ లోకి రానుంది.