English | Telugu

`య‌న్టీఆర్ 30`లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్?

త‌మిళ అనువాదాల‌తో తెలుగువారికి ప‌రిచ‌య‌మై.. ఆన‌క `క్రాక్`, `నాంది` వంటి స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ తో ఇక్క‌డివారికి మరింత‌ చేరువ‌య్యారు కోలీవుడ్ యాక్ట్ర‌స్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. ఒక‌వైపు త‌నే లీడ్ రోల్ గా కొన్ని సినిమాలు ప‌ట్టాలెక్కుతుండ‌గా.. మ‌రోవైపు మ‌రికొన్ని చిత్రాల్లో కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు ఈ `జ‌య‌మ్మ‌`.

ఈ నేప‌థ్యంలోనే.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి సంత‌కం చేశార‌ట‌ వ‌ర‌ల‌క్ష్మి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ క‌థానాయ‌కుడిగా సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ సినిమాని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే చిత్రంగా రూపొంద‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా క‌థ‌నాల ప్ర‌కారం.. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్ రోల్ కోసం వ‌ర‌ల‌క్ష్మిని ఎంపిక చేశార‌ని టాక్. త్వ‌ర‌లోనే `య‌న్టీఆర్ 30`లో వ‌ర‌ల‌క్ష్మి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, `య‌న్టీఆర్ 30`ని య‌న్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు.