English | Telugu

మ‌రో తెలుగు చిత్రంలో `దంగ‌ల్` భామ‌?

`ఇష్క్`, `చాచి 420`, `బ‌డే దిల్ వాలా`, `వ‌న్ 2 కా 4` చిత్రాల్లో బాల‌న‌టిగా అల‌రించి.. ఆపై `దంగ‌ల్`లో మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ కూతురి పాత్ర‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది ఫాతిమా సనా షేక్. అయితే, `దంగ‌ల్` కంటే ముందు `నువ్వు నేను ఒక‌ట‌వుదాం` (2015) అనే తెలుగు చిత్రంలో క‌థానాయిక‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

క‌ట్ చేస్తే.. ఆరేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ మ‌రో తెలుగు సినిమాలో న‌టించేందుకు ఫాతిమా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. అంతా కొత్త‌వారితో తెర‌కెక్క‌నున్న స‌ద‌రు చిత్రంలో ఫాతిమాదే ప్ర‌ధాన పాత్ర అని, త‌న పాత్ర చుట్టూ క‌థ తిరుగుతుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఫాతిమా టాలీవుడ్ రి-ఎంట్రీపై మ‌రింత‌ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, ఫాతిమా స‌న ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం `అరువి` హిందీ వెర్ష‌న్ లో నాయిక‌గా న‌టిస్తోంది. ఇ. నివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అభినయానికి ఆస్కార‌మున్న పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నుంది. మ‌రి.. రాబోయే చిత్రాల‌తో ఫాతిమా ఎలాంటి గుర్తింపుని తెచ్చుకుంటుందో చూడాలి.