English | Telugu

భగీరథకు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన "మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్" అన్న పుస్తకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సి.పార్ధసారధి ఆవిష్కరించారు. దుబాయ్ లోని గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్లో కళ పత్రిక 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మహానటుడు ఎన్ .టి రామారావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక, కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్ధ సారథి 'మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్' పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు, రెండవ కాపీని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు అందించారు.

నందమూరి తారక రామారావు గారు, ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఇద్దరూ యుగ పురుషుల ని, తెలుగు వారందరికీ వారు గర్వకారణం అన్నారు. దుబాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఎన్.టి.రామారావు గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత భగీరథ ను ఆయన అభినందించారు. కళ, కలయిక ఫౌండేషన్ తరుపున పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. భగీరథకు ఎన్.టి.ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డును ప్రదానం చేశారు .

ఈ సందర్భంగా భగీరథ మాట్లాడుతూ.. "మహానటుడు రామారావు శత జయంతి సందర్భంగా తాను రచించిన "మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి.ఆర్" పుస్తకం తొలి ముద్రణను రామారావు గారి కుమార్తెలు లోకేశ్వరి, పురందేశ్వరి హైదరాబాద్ లో ఆవిష్కరించారని, రెండవ ముద్రణను ఎన్నికల ముఖ్య అధికారి పార్ధ సారధి దుబాయ్ లో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. కళ పత్రిక సంపాదకుడు మహమ్మద్ రఫీ, కలయిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేరాల నారాయణ కు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.