English | Telugu

నెక్స్ట్ రౌండ్‌కి రెడీ అవుతున్న ‘సార్ప‌ట్ట‌’

ఆర్య హీరోగా న‌టించిన సినిమా సార్ప‌ట్ట ప‌రంప‌ర‌. ఆ మ‌ధ్య ఓటీటీలో విడుద‌లై విశేష‌మైన ప్ర‌జాద‌ర‌ణ‌ పొందింది. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. ఇందులోనూ ఆర్య హీరోగా న‌టించ‌డం క‌న్‌ఫ‌ర్మ్ అయింది. 2021లో విడుద‌లైంది సార్ప‌ట్ట ప‌రంప‌ర‌. బాక్సింగ్ అంటే ఇంట్ర‌స్ట్ ఉన్న క‌పిల‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన క‌థ ఇది. నార్త్ చెన్నై ప్రాంతంలో 1970లో జ‌రిగిన బాక్సింగ్‌ను ప్ర‌ధానంగా ఇందులో చూపించారు. ఆర్య‌, ప‌శుప‌తి, తుషారా విజ‌య‌న్‌, జాన్ విజ‌య్‌, క‌లైయ‌ర‌స‌న్‌, కాళి వెంక‌ట్ ఈ సినిమాలో కీ రోల్ చేశారు. మాట‌లు, పాత్ర‌ల తీరుతెన్నులకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుంద‌ని చాలా వార్త‌లొచ్చాయి.