English | Telugu
మస్తు బిజీగా ఉన్న కొత్తపెళ్లి కూతురు కియారా!
Updated : Mar 1, 2023
పెళ్లి ముచ్చట్లు ఇంకా తనివి తీరా చెప్పుకోనేలేదు, హనీమూన్‌కి వెళ్లొచ్చిన సూట్‌కేసుల్ని సాంతంగా సర్దుకోనేలేదు, అప్పుడే షూటింగులకు హాజరవుతున్నారు కియారా. ఆల్రెడీ వ్యానిటీ వ్యాన్ ఫొటోలను, మస్కారా మేకప్పులను ఇన్‌స్టాఫాలోయర్లతో పంచుకున్నారు ఈ బ్యూటీ.
ప్రస్తుతం షూటింగులో ఉన్న కియారా త్వరలోనే ముంబైకి చేరుకుంటారు. అక్కడ మార్చి 4 నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. కేవలం చూడ్డానికి కాదు, అక్కడ పెర్ఫార్మ్ చేయడానికి అంగీకరించారు మిసెస్ కియారా. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఈ ఓపెనింగ్ గేమ్‌లో ఆడనున్నారు. డబ్ల్యూ పీ ఎల్ 2023 ఓపెనింగ్ డేలో కియారా పెర్ఫార్మెన్స్ చేయనున్నారన్నది స్ట్రాంగ్ న్యూస్. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కోసం ఆర్గనైజర్స్ ముందు నుంచే ఫాలో అప్‌లో ఉన్నారట. పెళ్లి తర్వాత కుదురుతుందో లేదోనని కియారా నసిగారట. అయినా, వాళ్లు అడిగే తీరు చూసి కాదనలేక ఒప్పుకున్నారట.కియారా, సిద్ధార్థ్ పెళ్లి ఫిబ్రవరి 7న జరిగింది. రాజస్తాన్ జైసల్మేర్‌లోని కోటలో పెళ్లి చేసుకున్నారు సిద్- కియారా. పెళ్లి రోజు ముందు కూడా వీరిద్దరూ ఎక్కడా ఆ విషయం గురించి నోరు తెరవలేదు. పెళ్లికి సన్నిహితులను పిలుచుకున్నారు. మిగిలిన ఇండస్ట్రీకి ముంబై, ఢిల్లీలో ధావత్ ఇచ్చారు. ముంబైలో కొత్తగా కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యారు కియారా - సిద్. షేర్షా సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు.
ఈ ఏడాది ఆల్రెడీ సిద్‌కి మిషన్ మజ్ను విడుదలైంది. అయితే ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో రష్మిక మందన్న నాయికగా నటించారు.రామ్‌చరణ్ నటిస్తున్న 15వ సినిమాలో నాయికగా నటిస్తున్నారు కియారా. ఆల్రెడీ వీరిద్దరూ కలిసి వినరవిధేయరామాలో నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు శంకర్ సినిమా మీదే అందరి కళ్లూ ఉన్నాయి.