English | Telugu
ఏప్రిల్ 7 కు ముస్తాబవుతున్న రవితేజ!
Updated : Feb 28, 2023
క్రాక్ మూవీతో రవితేజ మరలా ట్రాక్ లోకి వచ్చారు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఇచ్చాడు. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లు డిజాస్టర్ గా నిలిచాయి. కానీ ఆ వెంటనే మరలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని సొంతం చేసుకున్నారు. సోలో హీరోగా నటించిన ధమాకా చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనూహ్యంగా ప్రేక్షకాదరణ పొంది 100 కోట్ల క్లబ్ లో చేరింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఈ స్థాయిలో ఆడుతుందని చివరకు ఈ చిత్రం మేకర్స్ కూడా భావించలేదు. ఈ చిత్రానికి దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఆ తరువాత రవితేజ మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య చిత్రం చేశారు. ఇందులో ఆయన విక్రమ్ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రను పోషించారు. ఈ పాత్ర సినిమా విజయానికి మూలస్థంభం లాగా ఉపయోగపడింది. ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో రవితేజ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.
స్వామి రారా డైరెక్టర్ సుధీర్ వర్మతో రావణాసుర అనే చిత్రం చేస్తున్నారు. మర్డర్స్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అను ఇమాన్యుల్ మేఘ ఆకాష్ ఫరీ అబ్దుల్లా దక్ష నాగర్కర్ పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా పూర్తయింది ఇటీవల శాకినీ డాకినీ సినిమా టైంలో దర్శకుడు సుధీర్ వర్మ వివాదాలకు కారణమయ్యారు. కానీ రావణాసురపై మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. పక్కా ప్రణాళికతో ఈ సినిమా పనిని పూర్తి చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. మొత్తానికి సుధీర్ వర్మ ప్లానింగ్ చూసిన వారంతా ఆయన ఇప్పటికీ మేల్కొన్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రంతో సుధీర్ వర్మ మరలా ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.ఇక సుధీర్‌వర్మ స్వామిరారా చిత్రంతో పాటు దోచెయ్, కేశవ, కిర్రాక్ పార్టీ, రణరంగం, సూపర్ ఓవర్, శాఖిని డాఖిని చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో స్వామిరారా పెద్ద హిట్‌గా నిలిచింది. దోచెయ్, సూపర్ ఓవర్, శాఖిని డాఖిని చిత్రాలు సరిగా ఆడలేదు. కేశవ, కిర్రాక్ పార్టీ, రణరంగం వంటి చిత్రాలు ఓకే అనిపించాయి. మొత్తానికి రావణాసుర చిత్రం మాత్రం ఖచ్చితమైన సమయంలోవస్తోంది. రవితేజ హిట్లమీద జోరుగా ఉన్నారు. సుధీర్ వర్మ కసిగా ఉన్నారు. కాగా రావణాసుర చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు.