English | Telugu
పవర్ స్టార్ మూవీ నుంచి కీలక అప్డేట్!
Updated : Feb 28, 2023
తమిళ్ మూవీ 'వినోదయ సిత్తం' రీమేక్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇందులో పవన్ దేవుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న నటీనటుల వివరాలను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కి జోడీగా కేతిక శర్మ నటిస్తుండగా ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం పవన్ కేవలం నెల రోజులు మాత్రమే డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'దేవుడు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.