English | Telugu

రూ.450 కోట్ల బ‌డ్జెట్‌తో విశాల్ సినిమా!

పుర‌ట్చి త‌లైవ‌న్ విశాల్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు కుష్బు భ‌ర్త సుంద‌ర్ సి. సంఘ‌మిత్ర అనే సినిమాను రూ.450 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాను 300 కోట్ల‌తో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు సుంద‌ర్‌.సి. ఆయ‌న ప్ర‌క‌టించినప్పుడు హీరో, హీరోయిన్లుగా జ‌యం ర‌వి, శ్రుతిహాస‌న్ పేర్లు వినిపించాయి. అయితే ప్రాజెక్ట్ మ‌రింత లేట్ అవుతుండ‌టంతో సారీ చెప్పేసి ప‌క్క‌కు త‌ప్పుకున్నారు శ్రుతిహాస‌న్‌. సంఘ మిత్ర కేర‌క్ట‌ర్ కోసం అప్ప‌ట్లో శ్రుతి క‌త్తిసాము కూడా నేర్చుకున్నారు. క‌ళ‌రియ‌ప‌ట్టు మీద కూడా గ్రిప్ సాధించారు.