English | Telugu
నెక్స్ట్ రౌండ్‌కి రెడీ అవుతున్న ‘సార్పట్ట’
Updated : Mar 7, 2023
ఆర్య హీరోగా నటించిన సినిమా సార్పట్ట పరంపర. ఆ మధ్య ఓటీటీలో విడుదలై విశేషమైన ప్రజాదరణ పొందింది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. ఇందులోనూ ఆర్య హీరోగా నటించడం కన్‌ఫర్మ్ అయింది. 2021లో విడుదలైంది సార్పట్ట పరంపర. బాక్సింగ్ అంటే ఇంట్రస్ట్ ఉన్న కపిలన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన కథ ఇది. నార్త్ చెన్నై ప్రాంతంలో 1970లో జరిగిన బాక్సింగ్‌ను ప్రధానంగా ఇందులో చూపించారు. ఆర్య, పశుపతి, తుషారా విజయన్, జాన్ విజయ్, కలైయరసన్, కాళి వెంకట్ ఈ సినిమాలో కీ రోల్ చేశారు. మాటలు, పాత్రల తీరుతెన్నులకు మంచి పేరొచ్చింది.
ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుందని చాలా వార్తలొచ్చాయి. అయితే దీని గురించి ఇటీవల కాలంలో చడీచప్పుడు లేదు. ఈ నేపథ్యంలో సార్పట్ట2 గురించి హింట్ ఇచ్చారు హీరో ఆర్య. ఈ సినిమా సెకండ్ పార్ట్ త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు ఆర్య. ఈ సారి సీక్వెల్‌ని థియేటర్లలోనే విడుదల చేయాలని నెట్టింట్లో పా. రంజిత్‌కి రిక్వెస్ట్ లు అందుతున్నాయి. ``మ్యాచ్ చూడటానికి మీరు రెడీయేనా? రోషంతో కూడిన ఆంగ్ల బాక్సింగ్ రౌండ్ 2`` అంటూ ఆర్య ఈ సినిమాకు సంబంధించిన డీటైల్స్ సోషల్ మీడియాలో లీక్ చేశారు హీరో ఆర్య. దీన్ని బట్టి త్వరలోనే సార్పట్ట సీక్వెల్ ఓపెనింగ్ ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మరోవైపు లింగుస్వామి దర్శకత్వంలోనూ ఆర్య ఓ సినిమాకు సైన్ చేస్తారనే టాక్స్ ఉన్నాయి. పా.రంజిత్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.