English | Telugu
అప్పుడు 'పుష్ప', ఇప్పుడు 'దసరా'.. నాని తగ్గేదేలే!
Updated : Mar 7, 2023
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై నాని ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. 'పుష్ప' తరహాలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నాని ప్రయత్నిస్తున్నాడు.
నాని సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. పైగా టీజర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో దసరాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే బయ్యర్లు తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. అయితే తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు నాని. ముంబై, లక్నో సహా నార్త్ లోని పలు ప్రధాన నగరాల్లో దసరా సినిమాను నాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పటికే ముంబై వెళ్లిన నాని పదిరోజులు అక్కడే ఉండి నార్త్ లో దసరా మూవీని గట్టిగా ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు. నార్త్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటు, పలు ప్రెస్ మీట్లు నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. నార్త్ లో 'పుష్ప' సినిమాకి విశేష స్పందన లభించింది. పెద్దగా అంచల్లేకుండా విడుదలైన ఈ సినిమా అక్కడ ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 'దసరా' కూడా పుష్ప తరహాలోనే రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న యాక్షన్ ఫిల్మ్. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం నార్త్ లో మంచి వసూళ్ళు రాబట్టడం ఖాయం. మరి 'దసరా'తో నాని పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.