English | Telugu
'రావణాసుర' టీజర్.. మాస్ రాజా విశ్వరూపం!
Updated : Mar 6, 2023
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రావణాసుర'. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్లు, గ్లింప్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న 'రావణాసుర' నుంచి ఈరోజు విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రవితేజ లాయర్ గా, క్రిమినల్ గా విభిన్న కోణాల్లో కనిపిస్తున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్ టీజర్ కి ప్రధాన బలంగా నిలిచింది. "సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్ళాలి" అంటూ సుశాంత్ తో రవితేజ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'స్వామి రారా'తో దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మ మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇప్పుడు 'రావణాసుర' టీజర్ చూస్తుంటే సుధీర్ బాబు భారీ విజయం అందుకోవడం ఖాయమనిపిస్తోంది.
శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.