English | Telugu
‘లాల్‌సలామ్’ షూటింగ్ అప్‌డేట్... అప్పుడే స్టార్ట్!
Updated : Mar 7, 2023
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్‌సలామ్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం గురించి సూపర్ అప్‌డేట్ వచ్చేసింది. 3, వెయ్ రాజా వెయ్ సినిమాల దర్శకురాలిగా మంచి పేరు ఉంది ఐశ్వర్య రజనీకాంత్‌కి. ప్రస్తుతం ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం లాల్‌సలామ్. ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు రజనీకాంత్. ఆయన ఇందులో క్రికెట్ కోచ్‌గా కనిపిస్తారని సమాచారం. రజనీతో పాటు విష్ణు విశాల్ కీ రోల్ చేస్తున్నారు. విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది లాల్‌సలామ్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. కారైక్కుడిలో ఫస్ట్ షెడ్యూల్‌ని షూట్ చేయనున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ పాల్గొనే కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా పనుల్లో ఉన్నారు. ఆ పనులు పూర్తి కాగానే లాల్ సలామ్ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు.
లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తున్నారు జీవిత. రాజశేఖర్‌తో వివాహం జరిగాక, ఇద్దరు పిల్లల తల్లిగా నటనకు దూరమయ్యారు జీవిత. రాజశేఖర్ హీరోగా కొన్ని చిత్రాలకు డైరక్షన్ చేశారు. ఇప్పుడు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. జీవిత కుమార్తెలు ఇద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. జీవిత కూడా కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశారు. కానీ నటిగా పూర్తిస్థాయి కేరక్టర్‌లో మేకప్ వేసుకుంటున్నది మాత్రం ఈ షెడ్యూల్ కోసమే. రజనీకాంత్ జైలర్ షూటింగ్ పూర్తి చేసుకున్నాక, ఈ సినిమాకు కాల్షీట్ కేటాయిస్తారు. జీవిత కూడా ఆ సమయంలోనే కాల్షీట్ ఇస్తానని అన్నారట. రజనీ తనయ అడగడం వల్ల మాత్రమే కాదు, లాల్ సలామ్‌లో అద్దిరిపోయే కేరక్టర్ ఉండటంతో వెంటనే ఓకే చెప్పేశారట జీవిత.