English | Telugu

హన్సికకి సర్ ప్రైజ్ కాంబోని ఇచ్చిన సోహెల్!

'హన్సిక లవ్ షాదీ డ్రామా' సీజన్ లోని ఒక్కో ఎపిసోడ్‌ ప్రతీవారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక సస్పెన్స్ తో ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు మేకర్స్ . కాగా 'ది ఫేరి టేల్ వెడ్డింగ్' అనే టైటిల్ తో  హన్సిక లవ్ షాదీ డ్రామా ఆరవ ఎపిసోడ్‌ తాజాగా విడుదల అయింది.‌ దీనిలో అందరూ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ల గురించి మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో పెళ్ళిలో ప్రభుదేవా సాంగ్ ప్లే చేసారు. దానికి సోహెల్ వెళ్ళి డ్యాన్స్ వేయగా హన్సిక వావ్ అంటూ ఆశ్చర్యపోయింది. ‌"నా కోసం చాలా కష్టపడ్డాడు సోహెల్. అసలు ఊహించలేదు డ్యాన్స్ అంత బాగా చేస్తాడని, నాకు సర్ ప్రైజ్ కాంబో ఇచ్చాడు" అని హన్సిక చెప్పింది.

ఇండియన్‌2 తర్వాత కమల్‌ సినిమా ఇదే!

యంగ్‌స్టర్స్‌ స్పీడు మీదుంటే గొప్పేముంటుంది? సీనియర్లు స్పీడు చూపిస్తుంటే ముచ్చటేస్తుంది. ఒకటీ, రెండూ, మూడూ అంటూ పరీక్షల రిజల్టులు వచ్చినప్పుడు వినిపించే ప్రకటనల్లాగా నాన్‌స్టాప్‌ సినిమాలతో రెడీ అవుతున్నారు సీనియర్‌ హీరోలు. వారిలో కమల్‌హాసన్‌ మరీ స్పీడు మీదున్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు నిర్మాతగానూ హెక్టిక్‌గా ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ చేస్తున్నారు కమల్‌. ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అన్నీ మంచికే, పెద్ద పనులు సులువుగా కావు. ఇలాంటి వాటిని దాటితేనే సిసలైన కిక్కు అంటూ మూవీ యూనిట్‌కి స్ఫూర్తి పంచుతున్నారు లోకనాయకుడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే సౌత్‌ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ జరిగే షెడ్యూల్‌లో ఓ భారీ ట్రైన్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది పూర్తయితే, ఇండియన్‌2 సినిమా దాదాపుగా కంప్లీట్‌ అయినట్టే. 

మళ్లీ వివాదంలో కేజీయఫ్‌... క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి

కేజీయఫ్‌ సినిమా విడుదలై సక్సెస్‌ అయి, వెయ్యి కోట్ల మార్కును కూడా దాటేసింది. ఫస్ట్ పార్ట్ కలిగించిన క్యూరియాసిటీతో సెకండ్‌ పార్ట్ సూపర్‌ సక్సెస్‌ అయింది. మూడో పార్టు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు జనాలు. తన తల్లి కోరిక మేరకు బంగారం మొత్తాన్ని తీసుకెళ్లిన రాకీభాయ్‌ ఏం చేశాడనేది ఇప్పుడు పార్ట్ త్రీలో చూడాల్సిన కథ. ఈ నేపథ్యంలోనే  ఈమధ్య కాంట్రవర్శీ మాటలు వినిపించాయి. అసలు అలాంటి పిచ్చి కోరిక కోరిన తల్లిని ఏమనాలి? ఆమె పిచ్చి మాటలు పట్టుకుని సముద్రంలోకి ఉరికిన హీరో పిచ్చితనాన్ని ఏమనాలి అంటూ విమర్శలు గుప్పించారు యంగ్‌ ఫిల్మ్ మేకర్స్. అసలు ఆ తల్లి కోరికలోనే అర్థం పర్థం లేదంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు కేజీయఫ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌.

తాప్సీ డైట్‌కి నెల‌నెలా ఎంత‌వుతుందో తెలుసా?

తాప్సీ ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ యాక్ట్రెస్ కాదు. అంత‌కు మించి. నేష‌న‌ల్ యాక్ట్రెస్‌. వైవిధ్య‌మైన స్క్రిప్ట్ సెల‌క్ష‌న్‌తో ఆమె ప్యాన్ ఇండియ‌న్ ఆర్టిస్టుగా మారిపోయారు. ముఖ్యంగా పింక్ సినిమా త‌ర్వాత నార్త్ ఇండియా తాప్సీ సినిమాల మీద స్పెష‌ల్‌గా కాన్‌సెన్‌ట్రేష‌న్ చేస్తోంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఉత్త‌రాదిన స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు తాప్సీకి. అయినా ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్‌తో దూసుకుపోయారు.  అప్ప‌టిదాకా ఆ ప‌ని చేసింది నార్త్ లో కంగ‌న మాత్ర‌మే. తాప్సీ త‌న‌ను చూసి కాపీ కొడుతోంద‌ని కూడా కంగ‌న మండిప‌డ్డ సంద‌ర్భాలు లేక‌పోలేదు. వాట‌న్నిటినీ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు తాప్సీ. త‌న‌వైన క‌థ‌ల‌తో దూసుకుపోయారు...