దీని తర్వాత 15 ఫ్లాప్ లు తీసినా మమ్మల్ని క్షమిస్తారు.. అంత మంచి సినిమా ఇది!
'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత యువ హీరో నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత.