English | Telugu

నన్ను పెళ్లి చేసుకుంటావా అష్షు...

జూనియర్ సమంత అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక స్మాల్ స్క్రీన్ పై వరుసగా ఆఫర్లు సంపాదించుకుంది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల ఆరబోత ఫోటోషూట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ వరకూ రీచ్ అయ్యింది. త్వరలో ఒక మూవీలో కూడా కనిపించబోతోంది. ఐతే ఇప్పుడు అష్షుని ఒక నెటిజన్ కొంటె ప్రశ్న ఒకటి వేసాడు "నన్ను పెళ్లిచేసుకుంటావా" అని అడిగాడు "అబ్బా సిగ్గేస్తోంది నాకు..డైరెక్ట్ గా మెస్సేజ్ చెయ్యి అని" నవ్వే ఎమోజిస్ పెట్టి సిగ్గుపడుతూ మరీ రిప్లై ఇచ్చింది.

"నిజమైన ఫ్రెండ్ షిప్ గురించి ఒక్క మాటలో చెప్పు" అని అడిగేసరికి "భరించటం" అని బాధగా చెప్పింది. "నీ అంత అందంగా అవ్వాలంటే ఏం చేయాలక్కా" అని అడిగేసరికి " తిడుతున్నావా, పొగుడుతున్నావా" అంటూ అనుమానంగా ముఖం పెట్టింది అష్షు. "లవ్ మీద మీ ఒపీనియన్" అని అడిగేసరికి "ఒద్దు బాబోయ్" అని చెప్పింది. "మీకు ఎవరైనా ప్రొపోజ్ చేశారా" అని అడిగేసరికి "లేదు బ్రదర్ ఎవరూ చేయలేదు" అని చెప్పింది. "నీ లక్ష్యం ఏమిటి" అని అడిగారు "నేను బాగుండాలి...నా పక్కన ఉన్నవాళ్లను బాగా చూసుకోవాలి" అని చెప్పింది. "పవన్ కళ్యాణ్ టాటూ చూపించవా" అని అడిగేసరికి ఆ ఇమేజ్ ఒకటి పోస్ట్ చేసింది. "థ్యాంక్యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్స్...త్వరలో లైవ్ సెషన్ లో మిమ్మల్నందరినీ కలుస్తాను" అని చెప్పింది. "ఏ మాస్టర్ పీస్" పేరుతో ఒక కొత్త మూవీ రాబోతోంది. అందులో ఆద్య అనే పాత్రలో కనిపించబోతోంది అష్షు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.