English | Telugu
రాజమౌళి చిత్రంలో హనుమంతుడి లక్షణాలతో మహేష్ కేరక్టర్!
Updated : Apr 12, 2023
2023లో ఒక్క రిలీజ్ కూడా లేదు టాలీవుడ్ సూపర్‌స్టార్ ఘట్టమనేని మహేష్‌బాబుకి. మిగిలిన హీరోలందరూ ఆస్కార్‌లనీ, వరుస రిలీజులని, ఓపెనింగ్‌లనీ సందడి చేస్తుంటే, మా బాబు సినిమా అప్‌డేట్స్ ఏవీ... అంటూ దిగులుపడుతున్నారు ఫ్యాన్స్. సమ్మర్ వెకేషన్‌లో ఉన్నారు ఘట్టమనేని మహేష్‌బాబు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్నారు మహేష్‌బాబు. ఈ సినిమాలోనే బ్రేక్ తీసుకుని ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఈ సినిమాలో మహేష్ తో మరోసారి జోడీ కడుతున్నారు పూజా హెగ్డే. 2024 సమ్మర్‌కి షెడ్యూల్‌ని ఫిక్స్ చేసుకుంది ఈ సినిమా. త్రివిక్రమ్ సినిమాకన్నా, రాజమౌళి సినిమా మీద ఎక్కువ హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించే సినిమా రామాయణం , మహాభారతంలోని పాత్రల లక్షణాలతో ఉంటుందట. జంగిల్ అడ్వెంచర్‌గా ఆల్రెడీ జోనర్ వైరల్ అవుతోంది.
ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ దద్దరిల్లేలా సినిమా చేయాలన్నది జక్కన్న ప్లాన్. రామాయణంలో హనుమంతుడి పాత్రకున్న లక్షణాలను ఈ సినిమాలో మహేష్‌బాబుకి ఆపాదించారట. ట్రిపుల్ ఆర్‌లో చారిత్రక పాత్రలకు సిల్వర్‌స్క్రీన్ టచ్ ఇచ్చినట్టు, ఈ సినిమాలో మహేష్‌బాబు కేరక్టర్‌కి హనుమంతుడి అపారమైన తెలివితేటలను, శక్తులను ఆపాదిస్తున్నారట. ఈ సినిమాకు రాజమౌళికి డిస్నీ బ్యాకింగ్ ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సోనీ పిక్చర్స్ కూడా తమ సాయాన్ని అందిస్తోంది. కె.వి. విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం కథను మలిచే పనిలో ఉన్నారు. 2021లో విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ``ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్‌ని కథగా మలుస్తున్నాం. ఇండియానా జోన్స్, జుమాంజీ తరహా కథ అవుతుంది`` అని అన్నారు. దాన్ని బట్టి మహేష్‌బాబును ఇంటర్నేషనల్ స్థాయిలో సగర్వంగా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.