English | Telugu
ప్రభాస్ మూవీ అప్డేట్స్ రాకపోవడానికి అతనే కారణం!
Updated : Apr 12, 2023
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మరే స్టార్ కి సాధ్యంకాని విధంగా వరుస భారీ ప్రాజెక్టులతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k', మారుతి ఫిల్మ్, 'స్పిరిట్' వంటి ఎన్నో ఆసక్తికర సినిమాలు ఉన్నాయి. అయితే 'ఆదిపురుష్' కారణంగా మిగతా సినిమాల నుంచి కీలక అప్డేట్స్ రావడంలేదని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ వల్లే తమ హీరో ఇతర సినిమాల అప్డేట్స్ రావట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యే వరకు ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ రావట. 'ఆదిపురుష్' నుంచి ఇప్పటిదాకా విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఆదిపురుష్ ప్రచార చిత్రాల పట్ల సంతృప్తిగా లేరు. ఈ తరుణంలో ప్రభాస్ ఇతర సినిమాల అప్డేట్స్ వస్తే, ఆదిపురుష్ కి మరింత నష్టమని భావించిన టీమ్.. ఆదిపురుష్ విడుదలయ్యే వరకు ఇతర సినిమాల అప్డేట్స్ రాకుండా చూడాలని ప్రభాస్ ని రిక్వెస్ట్ చేసిందట. దానివల్ల ప్రభాస్ తదుపరి చిత్రం ఆదిపురుష్ పైనే అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల దృష్టి ఉంటుందని వారి భావనట. అందుకే సలార్ టీజర్, ప్రాజెక్ట్-k ఫస్ట్ లుక్, ప్రభాస్-మారుతి ఫిల్మ్ అనౌన్స్ మెంట్ ని హోల్డ్ లో పెట్టారట. ఆదిపురుష్ విడుదలవ్వగానే ప్రభాస్ ఇతర సినిమాల సందడి మొదలవుతుందని ఇన్ సైడ్ టాక్.