English | Telugu
అప్పుడు చైతన్య.. ఇప్పుడు నిహారిక!
Updated : Apr 12, 2023
మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వారి విడాకుల వార్త నిజమేననే అభిప్రాయం కలుగుతోంది.
ఈమధ్య కొందరు సెలబ్రిటీ జంటలు తాము విడిపోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హింట్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ఇద్దరు కలిసున్న ఫోటోలను డిలీట్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు నిహారిక-చైతన్య కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.
చైతన్యతో నిహారిక వివాహం 2020 డిసెంబర్ లో జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కానీ కొంతకాలానినే సోషల్ మీడియా సాక్షిగా వీరి మధ్య దూరం పెరిగినట్లు కనిపించింది. వీరి మధ్య విభేదాలు వచ్చాయని, విడిపోయే అవకాశముందని కొంతకాలం క్రితం వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న కొన్ని ఫోటోలను విడుదల చేసి.. ఆ వార్తలకు చెక్ పెట్టింది ఈ జంట.
ఐతే ఇటీవల మరోసారి వీరి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. చైతన్య ఇన్‌స్టాగ్రామ్ లో నిహారికకు అన్ ఫాలో చేయడమే కాకుండా.. వారి వెడ్డింగ్ ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరూ పూర్తిగా విడిపోవడానికి సిద్ధమయ్యారనే వార్త బలంగా వినిపించింది. ఇప్పుడు ఆ వార్తకు నిహారిక మరింత బలం చేకూర్చింది. తాజాగా నిహారిక కూడా ఇన్‌స్టాగ్రామ్ లో చైతన్యను అన్ ఫాలో చేయడమే కాకుండా.. అతనికి సంబంధించిన ఫొటోలన్నీ డిలీట్ చేసింది. దీంతో వీరి విడాకుల వార్త నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.