English | Telugu
పవర్ స్టార్ 'ఓజీ'లో ప్రియాంక మోహన్!
Updated : Apr 11, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' అనే మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించనుందని సమాచారం.
ప్రియాంక మోహన్ తెలుగులో బిగ్ స్టార్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవడం ఇదే మొదటిసారి. గతంలో తెలుగులో నాని సరసన 'గ్యాంగ్ లీడర్', శర్వానంద్ సరసన 'శ్రీకారం'లో నటించిన ప్రియాంక.. తన మూడో సినిమాకి ఏకంగా పవర్ స్టార్ తో నటించే అవకాశం దక్కించుకుంది. మొదటి రెండు తెలుగు సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన ప్రియాంక.. మూడో సినిమా 'ఓజీ'తో కమర్షియల్ సక్సెస్ ని అందుకుంటుందేమో చూడాలి. వచ్చే వారం నుంచి ముంబైలో జరగనున్న 'ఓజీ' షూటింగ్ లో పవన్ తో కలిసి ప్రియాంక పాల్గొననుందని సమాచారం.