English | Telugu

మే 2న గుంటూరులో జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల ప్రదానం

రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు జర్నలిస్టులకు ప్రకటించిన ఉగాది పురస్కారాలను మే 2న గుంటూరులో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నట్లు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతిభ కలిగిన జర్నలిస్టులను ప్రోత్సహించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామనీ, ఇందులో భాగంగానే ఉగాది పురస్కారాలను అందజేస్తున్నామనీ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాలెంపాటి శ్రీనివాసరావు తెలిపారు. 23 విభాగాలకు సంబంధించి 25 మంది జర్నలిస్టులకు పురస్కారాలను ఇస్తున్నట్లు చెప్పారు.

మే 2న గున్టూరులో జరిగే అవార్డుల ప్రదాన వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్షీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వారు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి, ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావును కలిసి ఈ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ ఇద్దరూ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరవుతామని హామీ ఇచ్చారు. వారిని కలిసిన వారిలో సంఘం లీగల్ అడ్వైజర్ దద్దాల జగదీశ్ కూడా ఉన్నారు. తమ సంఘంలో సభ్యత్వం తీసుకునే జర్నలిస్టులకు రూ. 10 లక్షల మేర బీమా సౌకర్యం కల్పిస్తున్నామని మేడవరపు రంగనాయకులు తెలిపారు.

తెలుగువన్ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. సినిమా విభాగంలో తెలుగువన్ డాట్ కాం ఎడిటర్ (సినిమా) బుద్ధి యజ్ఞమూర్తి, అగ్రికల్చర్ జర్నలిజంలో టివన్ అగ్రి చానల్ చీఫ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్ సలీం షేక్ పురస్కారాలు అందుకోనున్నారు.