English | Telugu

మ‌ళ్ళీ వ‌స్తున్న `ప్రేమ దేశం` ద‌ర్శ‌కుడు!

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన ద‌ర్శ‌కుల్లో కోలీవుడ్ కెప్టెన్ క‌దిర్ ఒక‌రు. 30 ఏళ్ళ క్రితం విడుద‌లైన `ఇద‌యం` (తెలుగులో `హృద‌యం`)తో నిర్దేశ‌కుడిగా తొలి అడుగేసిన క‌దిర్.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఆపై `ఉళ‌వ‌న్`, `కాద‌ల్ దేశ‌మ్` (తెలుగులో `ప్రేమ దేశం`), `కాద‌ల‌ర్ దిన‌మ్` (తెలుగులో `ప్రేమికుల రోజు`), `కాద‌ల్ వైర‌స్` వంటి త‌మిళ సినిమాల‌ను.. `నన్ ల‌వ్ ట్రాక్` అనే క‌న్న‌డ చిత్రాన్ని రూపొందించారు క‌దిర్. వీటిలో `కాద‌ల్ దేశ‌మ్` అఖండ విజ‌యం సాధించింది. తెలుగు అనువాదం `ప్రేమ దేశం` కూడా అదే బాట ప‌ట్టింది...

తార‌క్ తో కృష్ణ‌వంశీ `రైతు`?

`రైతు`.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక ద‌శ‌లో ఈ సినిమాని నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేయాల‌నుకున్నాడాయ‌న‌. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల స‌ద‌రు ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడిదే స‌బ్జెక్ట్ ని యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట ఈ స్టార్ డైరెక్ట‌ర్. ఈ మేర‌కు సంప్ర‌దింపులు కూడా జ‌రుగుతున్నాయ‌ని టాక్. ఇదివ‌ర‌కు కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `రాఖీ`(2006) చిత్రం చేశాడు తార‌క్. ఆ సినిమా న‌టుడిగా ఎన్టీఆర్ కి మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో.. కృష్ణ‌వంశీతో మ‌రోసారి ప‌నిచేయ‌డానికి తార‌క్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో లేదో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.