English | Telugu
`రాధేశ్యామ్`.. ఆ 20 నిమిషాలు హైలైట్?
Updated : Aug 14, 2021
చాన్నాళ్ళ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `రాధేశ్యామ్`. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ, జయరామ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇటలీ నేపథ్యంలో సాగే ఈ పిరియడ్ లవ్ స్టోరీ.. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. `రాధేశ్యామ్`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. సినిమాకి చివరి 20 నిమిషాలు ఆయువుపట్టుగా నిలుస్తాయట. అంతేకాదు.. గ్రాఫిక్స్ తో ముడిపడిన ఈ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉంటాయని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రభాస్ ప్రస్తుతం `సలార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె` చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం.