పవర్‌స్టార్‌తో మరోసారి త్రిష రొమాన్స్?
తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన చెన్నై పొన్ను త్రిష.. హిందీ, కన్నడ, మలయాళ చిత్ర సీమల్లోనూ ఒక్కో సినిమాతో సందడి చేసింది. ఇదిలా ఉంటే.. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ మాలీవుడ్ లో రెండో సినిమాతో పలకరించేందుకు సిద్ధమవుతోంది. `దృశ్యం` సిరీస్ తరువాత మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ కెప్టెన్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ చిత్రమే.. `రామ్`. ఇందులో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుందట త్రిష.