English | Telugu
`ఏజెంట్` కోసం 15 నిమిషాల ఛేజింగ్ సీక్వెన్స్?
Updated : Aug 14, 2021
అక్కినేని బుల్లోడు అఖిల్.. తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ చిత్రమే.. `ఏజెంట్`. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానుసారం 15 నిమిషాల పాటు సాగే ఓ ఛేజింగ్ సీక్వెన్స్ ఉందట. హాలీవుడ్ స్థాయిలో ఈ సీక్వెన్స్ ని డిజైన్ చేసిందట యూనిట్. అంతేకాదు.. విదేశాల్లో ఈ ఛేజ్ ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
`ఏజెంట్`లో అఖిల్ కి జంటగా సాక్షి వైద్య నటిస్తోంది. మాలీవుడ్ స్టార్స్ మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా తెరపైకి రానుంది.
కాగా, మరోవైపు అఖిల్ తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలకు సిద్ధమైంది. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని `బొమ్మరిల్లు` భాస్కర్ డైరెక్ట్ చేశాడు.